ఇండిగో సంక్షోభం వేళ DGCA కీలక నిర్ణయం.. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 08:35:30  IST  )

ఇండిగో విమానాల రద్దు సంక్షోభం నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) ఇవాళ సంచలన ప్రకటన చేసింది.

ఇండిగో సంక్షోభం వేళ DGCA కీలక నిర్ణయం.. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో విమానాల రద్దు సంక్షోభం నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) ఇవాళ సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నియమాల్లోని ముఖ్యమైన రెండు ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు పైలట్లకు వారానికి తప్పనిసరిగా 48 గంటల విశ్రాంతి ఇవ్వాలన్న నియమాన్ని మళ్లీ పాత నియమం ప్రకారం 36 గంటలకు తగ్గించారు. వారానికి గరిష్ఠంగా రెండు రాత్రి ల్యాండింగ్‌లకే అనుమతి ఉన్న నియమాన్ని పూర్తిగా ఎత్తివేశారు.

కాగా, నవంబర్ 1 నుంచి అమలైన కొత్త FDTL నియమాల వల్ల ఇండిగోతో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌లో పైలట్ల కొరత తీవ్రమైంది. డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు మాత్రమే ఇండిగో దాదాపు 1,100 విమానాలను రద్దు చేసింది. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ అత్యవసరంగా పైలట్ల విధులపై ఆంక్షలను ఎత్తివేసింది. అయితే, డ్యూటీ సమయం 13 గంటలు, వారానికి గరిష్ఠ ఫ్లైయింగ్ 60 గంటలు వంటి ఇతర ముఖ్యమైన FDTL నియమాలు యథావిధిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది.

Next Story