- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air India Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక ఆదేశం
అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా బోయింగ్(Air India Boeing) విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 269 మంది మృతి చెందారు. ఈ ప్రమాద నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలంటూ ఆదేశాలిచ్చింది. వీలైనంత త్వరగా దేశంలోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని DGCA స్పష్టం చేసింది.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ఇండియా చర్యలకు దిగింది. భారత్ లోని అన్ని 787 సిరీస్ బోయింగ్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. అలాగే బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించనుంది.






