- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమాన ప్రయాణికులకు అలర్ట్...DGCA కొత్త రూల్స్ ఇవే!
విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రూల్స్ మార్చేస్తూ కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: విమాన ప్రయాణికులకు అలర్ట్. తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA) కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రూల్స్ మార్చేస్తూ కీలక ప్రకటన చేసింది. చార్టెడ్ విమానాల ఓనర్లు వెబ్సైట్ లో విమాన వయస్సు, పైలట్ అనుభవం లాంటి వివరాలు కచ్చితంగా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సేఫ్టీ విషయంలో పైలట్లనే కాకుండా పై అధికారులను కూడా బాధ్యుల్ని చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇక ఈ రూల్స్ బ్రేక్ చేస్తే పైలెట్ లైసెన్స్ ఐదు సంవత్సరాల పాటు రద్దు కానుంది. వాతావరణం బాగోలేక పోతే, విమానం ఆపేసే పవర్ పైలట్ కు కూడా ఇచ్చారు. ఆపరేటర్లు రియల్ టైం వెదర్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని కూడా డీజీసీఏ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక డీజీసీఏ కొత్త రూల్స్ అమలు చేస్తోన్న నేపథ్యంలో ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల జార్ఖండ్ లోని రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ పెను ప్రమాదంలో రోగితో పాటు మొత్తం 7 మంది మరణించారు. ఓ రోగిని రాంచి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలిస్తున్న క్రమంలో ఈ పెను ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం చోటు చేసుకున్న నేపథ్యంలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. దీంతో అన్యాయంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదాలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది DGCA.






