జగన్నాథ్ రథయాత్రకు వచ్చి అనారోగ్యం పాలైన 3,500 మంది భక్తులు!

by Phanindra |

జగన్నాథ్ రథయాత్రకు వచ్చిన భక్తుల్లో పాలైన 3,500 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఎండ దెబ్బకు 400 మంది స్పృహతప్పినట్లు సమాచారం.

జగన్నాథ్ రథయాత్రకు వచ్చి అనారోగ్యం పాలైన 3,500 మంది భక్తులు!
X

దిశ, నేషనల్ బ్యూరో: పూరి జగన్నాథుని రథ యాత్రను వీక్షించేందుకు వచ్చిన భక్తుల్లో 3500 మంది ఆస్పత్రిపాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు, భారీ రద్దీ, ఇతర కారణాల వల్ల భక్తులు అనారోగ్యం పాలయ్యారని హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వీరిలో 742 మందిని పూరి జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రిలో చేర్పించామని, మిగతా వారని పూరి ఐడీహెచ్‌, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఇతర హెల్త్ ఫెసిలిటీస్‌కు తరలించామని అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ ఎవరి ప్రాణాలకు హాని కలగలేదని స్పష్టంచేశారు. సుమారు 400 మంది ఎండకు స్పృహ తప్పారని, చాలామంది వెంటనే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు.

Next Story