‘గంగా నదిలో తేలుతున్న 3 క్వింటాళ్ల రాయి’.. చేతులెత్తి మొక్కిన భక్తులు(వీడియో)

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.

‘గంగా నదిలో తేలుతున్న 3 క్వింటాళ్ల రాయి’.. చేతులెత్తి మొక్కిన భక్తులు(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఘాజీపూర్‌లో గంగా నదిలో ఓ బండరాయి తేలడం చూసి భక్తులు(Devotees) ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో దానికి తాళ్లు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి పూజలు చేశారు. అంత బరువు ఉన్న రాయి నీటిలో మునగకపోవడంతో భక్తులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈ క్రమంలో ఆ రాయి 3 క్వింటాళ్ల బరువు ఉందని, అయినప్పటికీ నీళ్లలో మునగట్లేదని అక్కడ ఉన్నవారు చెప్పారు. ఆ రాయిపై హనుమాన్ ఫొటో, 'శ్రీరామ్' అని ఉండటం వల్ల భక్తులందరూ ఆ బండరాయికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకు దీనికి సంబంధం ఉందేమోనని అంటున్నారు. దీనిపై పరిశోధనలు జరపాలని పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రాయికి సంబంధించిన వీడియో(Video)లు సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి.వీడియో

Next Story