Prime Minister Modi : అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: ప్రధాని మోదీ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-11-23 12:07:42  IST  )

మహారాష్ట్ర( Maharashtra Elections)ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎక్స్ లో స్పందించారు.

Prime Minister Modi : అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: ప్రధాని మోదీ
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర( Maharashtra Elections)ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎక్స్ లో స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని ట్వీట్ చేశారు. చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు. ముఖ్యంగా మహిళలు, యువతకు ధన్యవాదాలు తెలిపారు. కలిసికట్టుగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమన్నారు. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఝార్ఖండ్ లో జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యలను లేవనెత్తడంలో, రాష్ట్రం కోసం పని చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు.

Next Story