ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. 118 విమానాలు రద్దు

by Muthe.Rajitha |   (  Updated:2025-12-30 06:03:26  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI)లో భారీగా విమాన సర్వీసులను రద్దు చేసారు.

ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. 118 విమానాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI)లో భారీగా విమాన సర్వీసులను రద్దు చేసారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ కొన్ని చోట్ల 50 నుంచి 100 మీటర్లకు పడిపోగా.. CAT-III హెచ్చరికలు జారీ చేసారు. దీనివల్ల సుమారు 118 విమానాలు రద్దు కాగా, 16 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. మరో 130కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసి ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించాయి.

డిసెంబర్ 31 వరకు పొగమంచు కొనసాగుతుందని IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇదే పరిస్థితి అమృత్‌సర్, చండీగఢ్ వంటి ఉత్తర భారత విమానాశ్రయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు తప్పనిసరిగా తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story