డెంగ్యూకు వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఐసీఎంఆర్!

by vinod kumar |
డెంగ్యూకు వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఐసీఎంఆర్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), పనేసియా బయోటెక్‌లు దేశంలో డెంగ్యూ వ్యాక్సిన్ కోసం మొట్టమొదటి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించాయి. రోహ్‌తక్‌లో బుధవారం ప్రారంభమైన ఈ ట్రయల్ పనేసియా బయోటెక్ అభివృద్ధి చేసిన భారతదేశపు దేశీయ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ కావడం గమనార్హం. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. డెంగ్యూకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో ఇదొక మంచి పురోగతి అని ప్రశంసించారు. ఐసీఎంఆర్, పనేసియా బయోటెక్ మధ్య ఈ సహకారం మరింత మంది పౌరులను రక్షించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేగాక ఆరోగ్య సంరక్షణలో ఆత్మనిర్భర్ భారత్‌ను బలోపేతం చేస్తుందని కొనియాడారు. కాగా, ప్రస్తుతం దేశంలో డెంగ్యూకు యాంటీవైరల్ చికిత్స, లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేనందున ఈ ట్రయల్స్ ఎంతో ఉపయోగపడతాయని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story