Democracy: భారత్‌లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం.. ప్యూ రీసెర్చ్ సర్వేలో వెల్లడి

by B.Srinivas |

ప్రజాస్వామ్య విధానం పట్ల అత్యధిక స్థాయిలో సంతృప్తికరంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.

Democracy: భారత్‌లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం.. ప్యూ రీసెర్చ్ సర్వేలో వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్య విధానం పట్ల అత్యధిక స్థాయిలో సంతృప్తికరంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. తమ దేశ డెమొక్రసీ పట్ల 74 శాతం మంది భారతీయులు సంతోషంగా ఉన్నారు. స్వీడన్ లో 75 శాతం తర్వాత రెండో స్థానంలో ఇండియానే ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2025లో 23 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్‌లో కేవలం 23 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్యం పట్ల అసంతృప్తిగా ఉన్నారని నివేదిక తెలిపింది. ఇక గ్రీస్ 81 శాతం, జపాన్ 76 శాతం, దక్షిణ కొరియా 71 శాతంతో ప్రజాస్వామ్యం పట్ల అత్యధిక స్థాయిలో అసంతృప్తి ఉన్న దేశాలుగా నిలిచాయి.

జపాన్ లో 24 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. 12 దేశాల్లో కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, గ్రీస్, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యూకే, యూఎస్‌లలో సర్వే చేయగా సగటున 64 శాతం మంది తమ ప్రజాస్వామ్యం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కేవలం 35 శాతం మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని తేలింది. సర్వే చేయబడిన 23 దేశాల్లో సగటున 58 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్య విధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల నుంచి ఈ సర్వే నిర్వహిస్తుండగా ప్రజాస్వామ్యం పని తీరుపై సంతృప్తి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది.

Next Story