- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air Pollution: డేంజర్ జోన్‌లో ఢిల్లీ.. మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని!
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పీల్చే గాలిలో నాణ్యత క్షీణిస్తూ, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 391 వద్ద నమోదైంది. ఇది ‘తీవ్ర కాలుష్యం’ (Severe Pollution) కేటగిరీలోకి వస్తోంది.
వాయు కాలుష్యం కారణంగా రాజధానిలో ఆకాశం పొగమంచుతో కమ్ముకు పోయింది. వైద్య నిపుణులు ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారికి కళ్ళు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని, ప్రజలు అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.






