నేటి నుంచి ఈ వాహనాలకు పెట్రోల్ బంద్!

by velandi.Saikiran |

పాత వాహనాలు ఉన్న యాజమానులకు షాక్ ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. ఇకనుండి కాలం చెల్లిన వాహనాలకు డీజిల్, పెట్రోల్

నేటి నుంచి ఈ వాహనాలకు పెట్రోల్ బంద్!
X

దిశ, వెబ్ డెస్క్ : పాత వాహనాలు ఉన్న యాజమానులకు షాక్ ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. ఇకనుండి కాలం చెల్లిన వాహనాలకు డీజిల్, పెట్రోల్ పోయరాదనే కొత్త నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనుంది. జూలై 1వ తేదీ నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రాబోతోంది. కాలుష్య నివారణే లక్ష్యంగా జులై 1వ తేదీ నుండి ఈ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతోంది. ఢిల్లీలోని స్థానిక వాహనాలకు మాత్రమే కాకుండా.. దేశంలో ఎక్కడ నుండి వచ్చిన వాహనాలకైనా సరే.. కాలం చెల్లిన వాహనాలకు ఇక్కడ ఇకనుండి డీజిల్, పెట్రోల్ పోయరు.

రిజిస్ట్రేషన్ చేసి పదేళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఢిల్లీలో ఇకనుండి ఇంధనం పోయరు. ఈ మేరకు తాజాగా ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలో తీవ్ర కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ నిబంధనలు తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు ఢిల్లీలో పాత వాహనాలు దాదాపు 62 లక్షలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో జూలై 1 నుండి ఢిల్లీలో నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఢిల్లీలో లైఫ్ టైం అయిపోయిన వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఉపయోగించబోతున్నారు. దీని ద్వారా ఈ వాహనాలకు జులై 1వ తేదీ నుండి ఢిల్లీలోని పెట్రోల్ బంక్ లలో ఇంధనం నింపడానికి అనుమతించరు. ఈ నూతన నిబంధనలను అమలు చేసేందుకు ఢిల్లీ అంతటా 500 స్టేషన్ లలో ఏఎన్పిఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నెంబర్ ప్లేట్ లను స్కాన్ చేయడం, వెహికిల్ రికార్డులను రియల్ టైమ్ లో చెక్ చేస్తున్నారు. ఈ కొత్త నిబంధన ప్రస్తుతానికి ఢిల్లీ వరకు మాత్రమే పరిమితమైంది.

Next Story