- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఉగ్రదాడి కేసు.. 15 మంది వైద్యుల కోసం పోలీసులు గాలింపు
దేశ రాజధాని ఢిల్లీలో గత వారం జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో గత వారం జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై NIA దర్యాప్తు వేగం పెరిగింది. ఉగ్రవాదులైన ఉమర్, ముజమ్మిల్‌లతో సంబంధాలు ఉన్నవారిని గుర్తించేందుకు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కాల్‌డేటా విశ్లేషణ, నిందితుల కమ్యూనికేషన్ రికార్డుల ఆధారంగా అనుమానితులను ఒకరి తర్వాత ఒకరిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్టు అనుమానిస్తున్న 15 మంది వైద్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదే సమయంలో ఆల్ఫలాహ్ యూనివర్సిటీ పై దాడులు నిర్వహించిన అధికారులు అనేక ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు కేసులో ఇప్పటివరకు రెండు FIRలు నమోదు చేసినట్లు సమాచారం. యూనివర్సిటీకి వచ్చిన నిధులు, ఉగ్రవాద సంస్థలకు చేరిన ఆర్థిక సహాయం, నెట్‌వర్క్ లింకులు వంటి అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. యూనివర్సిటీ రికార్డులన్నింటినీ అధికారులు పరిశీలిస్తూ, నిధుల మూలాలు, వినియోగంపై స్పష్టతకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరు పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి.






