- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India flight: ఇజ్రాయెల్ లో మిస్సైల్ దాడి.. విమానం దారి మళ్లింపు
ఇజ్రాయెల్ లో మిస్సైల్ దాడి కలకలం రేపింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ శివారులోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టు సమీపంలో మిసైల్ దాడి జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ లో మిస్సైల్ దాడి కలకలం రేపింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ శివారులోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టు సమీపంలో మిసైల్ దాడి జరిగింది. దీంతో ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని అధికారులు అబుదాబీకి మళ్లించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం AI139 టెల్ అవీవ్‌లో ల్యాండ్ కావడానికి దాదాపు గంట ముందు ఈ దాడి జరిగింది. దీంతో, దారి మళ్లించినట్లు సమాచారం. విమానం తిరిగి ఢిల్లీకి వచ్చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విమానాన్ని అబుదాబీకి మళ్లించాలని నిర్ణయం తీసుకున్న సమయానికి ఈ విమానం జోర్డాన్ గగనతలంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పరిణామాల నేపథ్యంలో టెల్ అవీవ్ నుంచి ఢిల్లీకి ఆదివారం రావాల్సిన ఎయిరిండియా విమానం రద్దయింది. అయితే, దీనిపై ఇంకా ఎయిరిండియా సంస్థ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.
మిస్సైల్స్ దాడి..
కాగా.. యెమెన్ నుంచి హూతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన మిస్సైల్స్ ఆదివారం ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయం ప్రధాన టెర్మినల్ సమీపంలో కూలినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. అయితే, టెల్ అవీవ్ శివారులోని ఎయిర్ పోర్టులో దట్టమైన పొగలు వెలువడినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్షిపణి దాడి నేపథ్యంలో టెల్ అవీవ్‌లోని విమానాశ్రయానికి విమాన రాకపోకలు నిలిపివేశారు. ఈ దాడిలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. తమపై దాడిచేసిన వారికి.. అంతకు ఏడు రెట్లు బలంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు.






