- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు పొట్టి బట్టలు వేసుకోలేదు.. రెస్టారెంట్‌లోకి నో ఎంట్రీ..
ఢిల్లీ టుబాటా రెస్టారెంట్ ట్రెండ్ అవుతోంది. ఏదో మంచి రెసిపీలు వడ్డించో.. ఫ్రీగా భోజనం పెట్టో.. భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించో.. ఇలా వైరల్ అవుతుందనుకునేరు. అస్సలు కాదు పొట్టి బట్టలు.. స్కిన్ షో లేకుండా వేసుకున్న దుస్తుల కారణంగా లోపలికి అనుమతించలేదు.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ టుబాటా రెస్టారెంట్ ట్రెండ్ అవుతోంది. ఏదో మంచి రెసిపీలు వడ్డించో.. ఫ్రీగా భోజనం పెట్టో.. భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించో.. ఇలా వైరల్ అవుతుందనుకునేరు. అస్సలు కాదు పొట్టి బట్టలు.. స్కిన్ షో లేకుండా వేసుకున్న దుస్తుల కారణంగా లోపలికి అనుమతించలేదు. అవును.. ఇద్దరు దంపతులు ట్రెడిషనల్ వేర్‌లో రెస్టారెంట్‌కు వెళ్లారు. స్పెషల్ డేను అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నారు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఎంట్రీలోనే ఆపేశారు. కారణం అడిగితే స్కిన్ షో డ్రెస్ వేసుకోలేదని సమాధానమిచ్చారు. అలాంటి డ్రెస్ వేసుకుంటేనే అలో చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియా సంప్రదాయాన్నే లెక్క చేయరా.. ఫారిన్ కల్చర్ ఫాలో అయితే.. దండం పెట్టి లోపలికి తీసుకెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






