బాంబే ఐఐటీలో ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-02 09:17:22  IST  )

మహారాష్ట్రలో (Maharasta) తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

బాంబే ఐఐటీలో ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ,వెబ్ డెస్క్: మహారాష్ట్రలో (Maharasta) తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాంబే ఐఐటీలో (IIT Bambay) శనివారం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ భవనం పైనుంచి దూకి చనిపోయాడు. హాస్టల్ టెర్రస్‌పై ఉన్న తోటి విద్యార్థి ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశారని తెలుస్తోంది. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతిచెందిన విద్యార్థి ఢిల్లీకి చెందిన రోహిత్ సిన్హా(22)గా గుర్తించారు. మృతుడు సైన్స్ విభాగంలో చదువుతున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంచనా వేస్తు్న్నారు. ఆత్మహత్య వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు.

Next Story