Delhi Riots Case: ఉమర్ ఖలీద్‍కు సుప్రీంకోర్టు షాక్

by Prasad Jukanti |   (  Updated:2026-01-05 06:10:12  IST  )

ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Delhi Riots Case: ఉమర్ ఖలీద్‍కు సుప్రీంకోర్టు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో (Delhi Riots 2020) ఐదేళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖలీద్ (Umar Khalid), షర్జీల్ ఇమామ్‍లకు (Sharjeel Imam) సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. వారి బెయిల్‍కు (Bail Rejected) నిరాకరించింది .ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ కు బెయిల్ మంజూరు చేసింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్రదారులుగా పేర్కొంటూ ఉమర్ ఖలీద్, షర్జీల్ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, రహమాన్ తదితరులపై పోలీసులు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా గత డిసెంబర్‍లో ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది. నిందితులు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపించగా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం అన్యాయమని నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వాదనలు ముగిశాక తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది.

ఉమర్‌కు మమ్దానీ సంఘీభావం:

కాగా న్యూయార్క్ నగర మేయర్ గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన జోహ్రాన్ మమ్దానీ ఉమర్ ఖలీద్‍కు సంఘీభావం తెలపడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ మేరకు ఉమర్ ఖలీద్‌కు సంఘీభావం తెలుపుతూ మమ్దానీ లేఖ పంపించారు. మనం అనుభవించిన కష్టం మన వ్యక్తిత్వాన్ని మార్చేయకూదని నువ్వు చెప్పే మాటలు నేనెప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటా. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.

Next Story