ఢిల్లీని ముంచేసిన పొగ మంచు.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై 349 పాయింట్లు

by Ajay Maddhiboyina |

ఢిల్లీలో కాలుష్యం తీవ్ర‌స్థాయికి చేరింది. మ‌రోసారి దేశ‌రాజ‌ధానిని పొగ‌మంచు క‌ప్పేసింది. ఉద‌యం 8 గంట‌ల‌కు న‌గ‌రంలో గాలి నాణ్య‌త AQI (Air Quality Index) 351 వ‌ద్ద న‌మోదైంది. బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జ‌హంగీర్ పురి మ‌రియు

ఢిల్లీని ముంచేసిన పొగ మంచు.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై 349 పాయింట్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీలో కాలుష్యం తీవ్ర‌స్థాయికి చేరింది. మ‌రోసారి దేశ‌రాజ‌ధానిని పొగ‌మంచు క‌ప్పేసింది. ఉద‌యం 8 గంట‌ల‌కు న‌గ‌రంలో గాలి నాణ్య‌త AQI (Air Quality Index) 351 వ‌ద్ద న‌మోదైంది. బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జ‌హంగీర్ పురి మ‌రియు ఇత‌ర ప్రాంతాలతో స‌హా ఢిల్లీలోని ప్ర‌ధాన ప్రాంతాల‌లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువ న‌మోదైంది.

బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు న‌గ‌రం యొక్క 24 గంట‌ల స‌గ‌టు ఏక్యూఐ 327 వ‌ద్ద న‌మోదు కాగా నేడు ఉద‌యం మ‌రింత క్షీణించింది. ఇక ఈ వారంలో మంగ‌ళ‌వారం 353 ఏక్యూఐ, సోమ‌వారం 328 ఏక్యూఐ వ‌ద్ద న‌మోద‌య్యాయి. తాజాగా 351కి చేర‌డంతో వ‌రుస‌గా 21వ రోజు 300 కంటే ఎక్కువ ఏక్యూఐ న‌మోదైంది. ఇదిలా ఉంటే న‌గ‌రంలో కాలుష్యం ఆందోళ‌న‌క‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే స్కూల్ పిల్ల‌ల‌ను గ్రౌండ్ల‌లో ఆడిపించ‌వ‌ద్ద‌ని పాఠ‌శాల యాజ‌మాన్యాల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. మ‌రోవైపు ప‌లు సంస్థ‌లు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రమ్ హోం క‌ల్పించాయి.

Next Story