- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : పేలుడు ఘటనపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో కీలక ఆధారాలు
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు ఘటనపై నగర పోలీసులు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు ఘటనపై నగర పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజీలో కీలక ఆధారాలను కనుగొన్నట్లు మీడియాకు తెలిపారు. ఫుటేజీ ఆధారంగా.. నెమ్మదిగా వెళ్తున్న కారులో పేలుడు జరిగిందని పేర్కొన్నారు. ఆ కారు కూడా వాహనాలు ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లగానే పేలుడు జరిగినట్లుగా గుర్తించామన్నారు. ఆ కారు కావాలనే రద్దీగా ఉన్న చోటికి వెళ్లిందా ? లేక కారులో వేరే వ్యక్తులు బాంబును అమర్చారా? పేలుడు ఎలా జరిగింది? అన్న విషయాలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న వాహనాలు ధ్వంసమవ్వగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే తగలబడిన కార్లలో సీఎన్జీ ట్యాంకుల్ని గుర్తించామని, పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. పరిస్థితిపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని, ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన వాహనంలోనే పేలుడు సంభవించినట్లు తెలిపారు. సాయంత్రం 6.52 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. కాగా.. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరగా.. క్షతగాత్రుల సంఖ్య 30కి చేరింది. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NIA, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తోంది.






