- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయి పిలిచిందని ఎగేసుకుని వెళ్తే.. ఇలాగే ఉంటది బ్రో!
డేటింగ్ యాప్ లో పరిచయమైన అమ్మాయి డేట్ చేద్దామని పిలవగా.. ముందూ వెనుక ఆలోచించకుండా వెళ్లిపోయాడో వ్యక్తి. తీరా చూస్తే..

దిశ, వెబ్‌డెస్క్: డేటింగ్ యాప్ లో పరిచయమైన అమ్మాయి డేట్ చేద్దామని పిలిస్తే.. ముందూ, వెనుక ఆలోచించకుండా ఎగేసుకుని వెళ్లిన ఓ వ్యక్తి.. నిలువునా సమర్పించుకోవాల్సి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అమాయకులను ఆకర్షించి, వారిని కిడ్నాప్ చేసి అందినకాడికి దోచుకుంటున్న ఒక ప్రమాదకరమైన ముఠాను ఆగ్నేయ ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 20 ఏళ్ల యువతితో పాటు నలుగురు యువకులు ఉన్నారు. వీరంతా కలిసి 34 ఏళ్ల ఒక వ్యక్తిని నెహ్రూ ప్లేస్ నుంచి కిడ్నాప్ చేసి, తీవ్రంగా దాడి చేసి రూ. 7 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో హర్లీన్ కౌర్ అలియాస్ జెన్నీ (20), జిమ్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నబ్జోత్ (30), వెటర్నరీ విద్యార్థి సంజయ్ అలియాస్ జోయి (28), క్యాబ్ డ్రైవర్ రిషబ్ (25), సాహిల్ చౌహాన్ ఉన్నారు.
డిసిపి (సౌత్ ఈస్ట్) హేమంత్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు జెన్నీ ఒక డేటింగ్ యాప్ ద్వారా బాధితుడికి పరిచయమైంది. మంగళవారం సాయంత్రం నెహ్రూ ప్లేస్‌లో డేటింగ్‌కు రావాలని అతడిని నమ్మించి పిలిచింది. బాధితుడు అక్కడికి చేరుకోగానే, రాత్రి 7 గంటల సమయంలో రెండు కార్లలో వచ్చిన ఆమె అనుచరులు అతడిని బలవంతంగా కారులోకి నెట్టారు. కారులో ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేసి, గొంతు నులమడంతో స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చిన తర్వాత అతడిని బెదిరించి యూపీఐ (UPI), ఏటీఎం విత్ డ్రాయల్స్, క్రెడిట్ కార్డ్ లావాదేవీల ద్వారా సుమారు రూ.7 లక్షలు బదిలీ చేయించుకున్నారు. రాత్రంతా అతడిని దక్షిణ ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో తిప్పి, బుధవారం ఉదయం 9:30 గంటలకు తిరిగి నెహ్రూ ప్లేస్ వద్ద వదిలేసి వెళ్ళిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కల్కాజీ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 309, 140 (కిడ్నాప్) కింద కేసు నమోదైంది. ఆన్ లైన్ పేమెంట్ వివరాల ఆధారంగా నిందితుల మొబైల్ నంబర్లను ట్రాక్ చేసిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో ఈ ముఠా గతంలో కూడా ఇదే తరహాలో ఒక డాక్టరుతో సహా మరో ఇద్దరిని దోచుకున్నట్లు తేలింది. వీరిపై గతంలో కేసులు ఏవీ లేకపోయినా, జెన్నీని ఎరగా చూపి వరుస దోపిడీలకు పాల్పడుతున్నట్లు డిసిపి వివరించారు. ఈ తరహా డేటింగ్ యాప్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






