- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National Herald case: సోనియా, రాహుల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీలకు (Rahul Gandhi) ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ చేసుకున్న అప్పీల్ పై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీని ఆదేశించింది. తదుపరి విచారణనజనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ (PMLA) కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోనియా, రాహుల్ గాంధీపై మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుకు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ పై సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సోనియా,రాహుల్ కు నోటీసులు ఇచ్చింది.






