ఉన్నావ్ అత్యాచారం కేసు.. కుల్దీప్‌కు షాకిచ్చిన హైకోర్టు

by Naga Rani Yarlagadda |

ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి.. బాధితురాలి తండ్రి.. కస్టడీలో మృతి చెందాడు. ఈ కేసులో బీజేపీ సస్పెండెడ్ లీడర్ కుల్దీ్ప్ సింగ్ సెంగర్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది.

ఉన్నావ్ అత్యాచారం కేసు.. కుల్దీప్‌కు షాకిచ్చిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి.. బాధితురాలి తండ్రి.. కస్టడీలో మృతి చెందాడు. ఈ కేసులో బీజేపీ సస్పెండెడ్ లీడర్ కుల్దీ్ప్ సింగ్ సెంగర్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. 10 ఏళ్ల శిక్షను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తప్పు పట్టింది. శిక్ష నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు సరైన కారణాలను తెలుపలేదని జస్టిస్ రవీందర్ తెలిపారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు.

2017లో కుల్దీప్ సింగ్ సెంగర్ యూపీలోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన మైనర్ ను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 ఏప్రిల్ నెలలో ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో ఉండగా మృతి చెందారు. 2019 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, ఇతర కేసులను యూపీలోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు. నేరం రుజువు కావడంతో అత్యాచారం కేసులో జీవిత ఖైదు, తండ్రి మృతి కేసులో పదేళ్లు జైలుశిక్ష విధించింది. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆయన్ను కస్టడీ నుంచి రిలీజ్ చేయొద్దని పేర్కొంటూ.. శిక్ష నిలిపివేతపై డిసెంబర్ 29, 2025న స్టే విధించింది.

Next Story