- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ATFపై భారీగా వ్యాట్ తగ్గింపు!
విమాన ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై ప్రస్తుతం ఉన్న 25 శాతం వ్యాట్ ను ఢిల్లీ సర్కార్ భారీగా తగ్గించింది.

దిశ, వెబ్‌డెస్క్ : విమాన ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై ప్రస్తుతం ఉన్న 25 శాతం వ్యాట్ ను ఢిల్లీ సర్కార్ భారీగా తగ్గించింది. ఈ మేరకు శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ATFపై ఉన్న 25 శాతం VAT ను ఏకంగా 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు.. ప్యాసింజర్లకు కూడా విమాన ప్రయాణ టికెట్లపై ధర తగ్గనుందని ప్రభుత్వ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం నిన్ననే (శుక్రవారం) ఏటీఎఫ్ ను 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ.. 6 నెలలపాటు ఇది అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఢిల్లీ సర్కార్ కూడా అదే బాటలో వ్యాట్ ను తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడం, మిడిల్ ఈస్ట్ లో నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థలపై, ప్రయాణికులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా విధానపరమైన నిర్ణయం వల్ల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఇంధన ఖర్చుల నుండి పెద్ద ఉపశమనం లభించనుంది. ఇది వారి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ప్రస్తుతం వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ (Peak Summer Travel Demand) ఎక్కువగా ఉన్న సమయంలో విమాన టికెట్ల ధరలు అదుపులో ఉండటానికి సహాయపడుతుంది.






