- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Governor: ఢిల్లీ సీఎం అతిశీ రాజీనామా.. గవర్నర్ వీకే సక్సేనా సెన్సేషనల్ కామెంట్స్
ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కేవలం 22 సీట్లను మాత్రమే గెలుచుకుని అధికారానికి దూరమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కేవలం 22 సీట్లను మాత్రమే గెలుచుకుని అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యలో ఆ రాష్ట్ర సీఎంగా కొనసాగుతోన్న అతిశీ (Atishi) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె నేరుగా రాజ్‌భవన్ (Raj Bhavan)కు తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lt. Governor VK Saxena)ను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో మాజీ సీఎం అతిశీ (Atishi)తో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lt. Governor VK Saxena) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణం యమునా నది (Yamuna River) శాపం తగిలిందని కామెంట్ చేశారు. ఈ విషయంలో తాను గతంలో మాజీ సీఎం కేజ్రీవాల్ (Former CM Kejriwal)ను కూడా హెచ్చరించానని.. ఆయినా ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదని గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది. అయితే, గవర్నర్ చేసిన కామెంట్స్ మాజీ సీఎం అతిశీ రిప్లై ఇవ్వలేదని రాజ్‌భవన్ సిబ్బంది తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మాజీ సీఎంను ఉద్దేశించి గవర్నర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఢిల్లీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ మారాయి.
కాగా, ఢిల్లీ ప్రజల దాహం తీర్చే యమునా నది (Yamuna River) కాలుష్యమయం అయిందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (National Green Tribunal) ఆరోపించింది. ఆ విషయంలో విచారణ జరిపి, నదిని పునరుద్ధరించే చర్యలను సిఫారసు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ (Lt. Governor) నేతృత్వంలో ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీకి పూర్తి సహకారం అందిస్తామని అప్పటి సీఎం కేజ్రీవాల్ పత్రికా ముఖంగా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ, హైలెవల్ కమిటీ (High Level Committe) ఏర్పాటు సరిగా లేదని ఆప్ సర్కార్ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసులో విచారణ రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. దీంతో యమునా నది ప్రక్షాళన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం అతిశీని ఉద్దేశించి ఆప్ సర్కారుకు యమునా నది శాపం తగులుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.






