- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫీజులు పెంచితే స్కూల్ క్లోజ్...ఢిల్లీలో కీలక చట్టం
ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు షాక్ ఇచ్చింది. ఫీజులు పెంచితే స్కూల్ క్లోజ్ చేసేలా కీలక చట్టాన్ని తీసుకువచ్చింది. స్కూల్ ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లుకు మండలి ఆమోదం తెలపడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది. దీంతో 1677 పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎవరైనా చట్టవిరుద్దంగా ఫీజులను పెంచితే ఏకంగా పాఠశాలనే క్లోజ్ చేస్తామని ముఖ్యమంత్రి గుప్తా వార్నింగ్ ఇచ్చారు. ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మరియు ప్రైవేటు పాఠశాలు ఏవైనా చట్టవిరుద్దంగా ఫీజులు పెంచడానికి వీళ్లేదని స్పష్టం చేశారు.
చరిత్రలో ఇలాంటి చట్టాన్ని తామే మొదటిసారి తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇటీవలి కాలంలో ఫీజులు ఇష్టానుసారంగా పెంచడం అనేది చర్చగా మారిందని చెప్పారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను, పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కేజ్రీవాల్ ప్రభుత్వం ఫీజులను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇదిలా ఉంటే స్కూల్ ఫీజుల సమస్య ఢిల్లీలోనే కాకుండా దేశం అంతటా ఎదురవుతోంది. దీంతో దేశం మొత్తం ఇలాంటి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.






