నిర్మాణ కార్మికులకు ₹10,000 పరిహారం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

by Malleboina Mahesh |

ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విధించిన GRAP III, GRAP IV ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

నిర్మాణ కార్మికులకు ₹10,000 పరిహారం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విధించిన GRAP III, GRAP IV ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ₹10,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా బుధవారం ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ, GRAP III నిబంధనలు సుమారు 16 రోజుల పాటు అమల్లో ఉన్నాయని, ఈ కాలంలో ప్రభావితమైన కార్మికులందరికీ ఈ పరిహారం అందుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన కార్మికులకు మాత్రమే ఈ ప్రయోజనం అందుతుందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆయన తెలిపారు.

అలాగే ఢిల్లీలో భారీగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టే క్రమంలో ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించి మరో కఠిన నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందిలో 50 శాతం మందికి తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని మంత్రి కపిల్ మిశ్రా ఆదేశించారు. ఈ నిబంధనను పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఆసుపత్రులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ వంటి అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story