- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం.. మేజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ (BJP) సంచలనం సృష్టించింది. ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ అయినా మ్యాజిక్ ఫిగర్ (Magic Figure) 36 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో అధిక్యాన్ని పదర్శిస్తుండటంతో ఆ పార్టీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటేసింది. కొన్ని నియోజవర్గాల్లో అధికార ఆప్ (AAP), బీజేపీ (BJP) మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot)లో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
తాజా సమాచారం ప్రకారం బీజేపీ 42, ఆప్ 25, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 2 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. బురారి, మాలవ్య నగర్, దేవ్‌లీ స్థానాల్లో ఆప్ దూసుకెళ్తోంది. ఇక జంగ్‌పురాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీలో మాజీ సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), కల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతిశీ (Athishi) ఇంకా వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ ఎదరుదెబ్బ తగిలింది. వస్తున్న ఫలితాల మేరకు ఆ పార్టీకి 4 శాతం ఓట్లు కూడా దాటలేదు. ఇక బీజేపీ (BJP) సుమారు 52 శాతం ఓట్లతో దూకుడును పదర్శిస్తోంది. ఆమ్ఆద్మీ పార్టీ (AAP)కి 43 శాతం ఓట్లు వచ్చాయి. ట్రెండ్స్ ఇలానే కొనసాగితే.. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న 26 ఏళ్ల బీజేపీ కల నెరవేరనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.






