- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Election Results: మాజీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 1,800 ఓట్ల తేడాతో వెనుకంజ
ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి తీవ్ర పరాభవం ఎదురైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి తీవ్ర పరాభవం ఎదురైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) కౌంటింగ్ ప్రారంభం కాగా.. అందులో ఆప్ కీలక నేతలను మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), సీఎ ఆతిశీ (CM Athishi) వెనుకంజలో ఉన్నారు. అందులో అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) న్యూఢిల్లీ (New Delhi) స్థానం నుంచి పోటీ చేశారు. ఆయనపై సమీప బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Parvesh Varma) 1,800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు బాదిలి స్థానంలో కాంగ్రెస్ (Congress) అభ్యర్థి దేవేంద్ర యాదవ్ (Devendra Yadav) ముందంజలో ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఆధిక్యం కనిపించింది. శకూర్‌బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ (Satyendra Jain) ముందంజలో కొనసాగుతున్నారు. ముస్లిం కమ్యూనిటీ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం.






