Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కీలక ప్రకటన !

by Y. Venkata Narasimha Reddy |

ఢిల్లీ సీఎం(Delhi CM)గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా(Rekha Gupta) కీలక ప్రకటన(Key Announcement) చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం(Financial assistance for women) అందిస్తామని ప్రకటించారు.

Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కీలక ప్రకటన !
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ సీఎం(Delhi CM)గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా(Rekha Gupta) కీలక ప్రకటన(Key Announcement) చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం(Financial assistance for women) అందిస్తామని ప్రకటించారు. మార్చి 8 లోపు నగదు జమ అవుతుందని రేఖా గుప్తా చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ శీశ్ మహాల్ ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు. ఆప్ ప్రభుత్వ పాలనను విమర్శించన రేఖా గుప్తా ప్రతి పైసాకు ఆప్ ఢిల్లీ ప్రజలకు లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు.

ఇక మీదట తాను ప్రజల మధ్యే ఉంటానని..నా బాధ్యతను నేను అత్యంత నిజాయితీగా నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని..నాపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతను నాకు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా పార్టీ చేసిన అన్ని హామీలను పూర్తి చేయడం నా మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బీజేపీ తన ఢిల్లీ ఎన్నిక మ్యానిఫెస్టోలో అధికారంలోకి వస్తే మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ రూ.2,100 మద్దతు ఇస్తామని ప్రకటించింది.

కాగా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఈ రోజు రాంలీలా మైదానంలో సహచర ఆరుగురు మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు గుప్తా కాశ్మీరీ గేట్ వద్ద ఉన్న శ్రీ మార్గట్ వాలే హనుమాన్ బాబా ఆలయాన్ని సందర్శించారు. మరోవైపు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ పార్టీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లను కూడా ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిష్ట్ పేరును ప్రకటించింది. మోహన్ సింగ్ బిష్ట్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి ఆయన ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానం నుండి గెలిచారు. విజేంద్ర గుప్తా రోహిణి అసెంబ్లీ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Next Story