ఈవిఎమ్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం

by Malleboina Mahesh |

దేశ రాజధాని ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ఈవిఎమ్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీపై ఈవిఎమ్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈవిఎమ్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ఈవిఎమ్ ట్యాపింగ్ (EVM tapping) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) అధికార బీజేపీపై ఈవిఎమ్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓట్ చోరి (Vote theft) అంటూ ఆయన సరికొత్త ప్రచారానికి తెర తీయగా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిలబడిన ప్రతి ఎన్నికల్లో ఓటమి చెందిందని, ఇది జీర్ణించుకోలేకనే రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్డీయే నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ సీఎం రేఖ గుప్తా (Delhi CM Rekha Gupta) ఓ జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను యాంకర్లు గుర్తు చేశారు.

ఈ క్రమంలో సీఎం రేఖ గుప్తా స్పందిస్తూ.. ఈవీఎంల ట్యాంపరింగ్ (Tampering of EVMs) జరిగిందని రాహుల్ గాంధీకి ఎవరు చెప్పారు. వాటిని ట్యాంపరింగ్ చేయవచ్చని ఎక్కడ రాసిఉందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా అధికారంలో ఉందని ఒక వేళ వాళ్లు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. అదే నిజమైతే.. వాళ్ళు చేస్తే రైట్.. మేం చేస్తే తప్పా..? వాళ్లు గెలిస్తే ప్రజాతీర్పు?.. మేం గెలిస్తే ఈవీఎం హ్యాకింగా?.. ఈ ఫార్ములా ఏ పుస్తకంలో ఉందో ఎవరైనా చెబుతారా?.. రాహుల్‌ ఈ విషయాన్ని ఎక్కడ చదువుకున్నారంటూ సీఎం రేఖా గుప్తా హాట్‌ కామెంట్స్ చెశారు.

Next Story