- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసం.. సీఎం రేసులో ఉంది ఎవరో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ ఇప్పటి వరకు 12 స్థానాల్లో విజయం సాధించి, 36 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) 4 చోట్ల విజయం సాధించి 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ అగ్ర నేతలు అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyandra Jain), తదితరులు ఓటమి పాలయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం (Delhi CM) ఎవరు అనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, న్యూఢిల్లీ (New Delhi) అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)పై విజయం సాధించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ (Parvesh Sahib Singh Verma) తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah)ను మర్యాపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆయనకే ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారని అటు సోషల్ మీడియా.. ఇటు జాతీయ మీడియాలోనూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు కావడం విశేషం.






