- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi CM: నేను శీష్ మహల్ లో కూర్చొని పనిచేసే టైప్ కాదు- ఢిల్లీ సీఎం
ఆమ్ ఆద్మీ పార్టీపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Rekha Gupta) విరుచుకుపడ్డారు. ఇండియా టుడే కాన్ క్లేవ్ లో రేఖా మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Rekha Gupta) విరుచుకుపడ్డారు. ఇండియా టుడే కాన్ క్లేవ్ లో రేఖా మాట్లాడారు. ఆప్ అధికారంలో ఉన్నంత కాలం ఢిల్లీలో అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రజల గురించి ఆలోచించకుండా శీష్ మహల్ (sheesh mahal) నిర్మించుకోవడంలో బిజీ అయిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను శీష్ మహల్ లో కూర్చొని పనిచేసే సీఎం కాదని.. 24 గంటలు ప్రజల మధ్యే ఉంటూ వారికోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మహిళను సీఎం చేసి ఈజీగా అధికారం తమ చేతిలో పెట్టుకోవచ్చని బీజేపీ నేతలు రేఖను సీఎంగా చేశారనే వార్తలపై ఆమె స్పందించారు. మహిళలపై కాషాయ పార్టీకి ఉన్న గౌరవంతోనే ఢిల్లీకి తానను సీఎంగా ఎంపిక చేశారని బదులిచ్చారు. సీఎం పదవిలో ఉన్న తనను నియంత్రించేది కేవలం ప్రజలే అని చెప్పారు. పార్టీ నేతలు తనకు కేవలం సహాయ సహకారాలు మాత్రమే అందిస్తారని అన్నారు. కానీ, అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచన వారికి ఉండదన్నారు.
ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేస్తాం
తామంతా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఢిల్లీని అభివృద్ధి బాటలో నడుపుతామని రేఖా గుప్తా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘అధికారం చేపట్టిన తొలిరోజే రోజే శీష్ మహల్‌లో ఉండబోనని చెప్పాను. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును విశ్రాంతి, సౌకర్యం కోసం ఉపయోగించుకునే హక్కు నాకు లేదు. ఆ ఆస్తి ప్రజలది’’ అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ సీఎం ఉన్నప్పుడు అధికారిక నివాసంగా వాడిన బంగ్లాను శీష్ మహల్ అని బీజేపీ పేర్కొంది. కేజ్రీవాల్ మోసాలకు ఆ మహల్ ఓ ఉదాహరణ అని బీజేపీ ప్రచారం చేపట్టి అధికారంలో వచ్చింది.






