ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్.. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ షట్‌డౌన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-11 06:06:19  IST  )

ప్రశాంతంగా ఉన్న రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబ్ బ్లాస్ట్ దేశ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్.. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ షట్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంతంగా ఉన్న రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబ్ బ్లాస్ట్ దేశ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ (Red Fort Metro Station) సమీపంలోని గేట్ నెంబర్ 1 సమీపంలో సుభాష్ మార్గ్‌ (Subhash Marg)లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న హ్యుందాయ్ ఐ20 కారులో భారీ పేలుడు సంభంవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందగా.. 20 మందికి గాయలయ్యాయి. ఈ షాకింగ్ ఘటనపై కేంద్ర ఇంటెలిజెన్స్ దేశమంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అనంతరం ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఫోరెన్సిక్ బృందాలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) ఢిల్లీ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని సురక్షితం చేసి 500 మీటర్ల రేడియస్‌లో నో ఎంట్రీ కార్డన్ ఏర్పాటు చేశారు. అయితే, ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తు కొనసాగుతుండటంతో ఆ మెట్రో స్టేషన్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లుగా ఢిల్లీ మెట్రో ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ ప్రాంతంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

Read More... ఢిల్లీ పేలుడుపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీజేఐ గవాయ్

Next Story