ఢిల్లీ పేలుడు.. అత్మహుతిగా అనుమానం

by Muthe.Rajitha |

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ పేలుడు.. అత్మహుతిగా అనుమానం
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10 కి చేరింది. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఈ పేలుడు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీస్‌ కమిషనర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6.52గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు వెల్లడించారు.

ఎర్రకోట సమీపంలో నిదానంగా వచ్చి రెడ్‌లైట్‌ వద్ద కారు ఆగిందని, ఆగి ఆగుతుండగానే ఒక్కసారిగా పేలుడు జరిగిందని వివరించారు. అయితే ఇది ఆత్మహుతి దాడి అయి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఘటనా స్థలంలో ఒక బుల్లెట్ కూడా లభ్యం అయినట్టు సమాచారం.

Next Story