ఢిల్లీ బ్లాస్ట్.. 1000 అడుగుల దూరం ఎగిరిపడ్ద చెయ్యి

by Muthe.Rajitha |

ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ బ్లాస్ట్.. 1000 అడుగుల దూరం ఎగిరిపడ్ద చెయ్యి
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే పేలుడు ఘటన తీవ్రతను తెలియజేసే మరో వీడియో వైరల్ అవుతోంది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి చెయ్యి తెగి, 1000 అడుగుల దూరంలో ఎగిరి పడింది. ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులకు ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారం మేరకు.. అక్కడికి వెళ్లి చూడగా.. ఓ షాపు మీద తెగిన చెయ్యి పడి ఉండటం సంచలనం రేపింది. ఆ చెయ్యి ఎవరిదనేది గుర్తించడానికి DNA టెస్టులకు పంపించారు అధికారులు.

Next Story