Delhi Blast Case: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. మరో అనుమానిత కారు స్వాధీనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-12 13:21:08  IST  )

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌ కేసులో అనూహ్యంగా మరో అనుమానిత కారు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Delhi Blast Case: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. మరో అనుమానిత కారు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌ కేసులో అనూహ్యంగా మరో అనుమానిత కారు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ కారు కోసం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు చేపట్టిన వేట సఫలమైంది. ఎట్టకేలకు డాక్టర్ ఉమర్ పేరుపై రిజిస్టర్ అయిన ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ ఎరుపు రంగు కారు (నెంబర్: DL 10 CK 0458) హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌ (Faridabad)లోని ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసి ఉంది. దీంతో ఆ కారును పోలీసులు సీజ్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం మొత్తం 3 రాష్ట్రాల్లో దర్యాప్తు బృందాల వేట కొనసాగుతోంది.

Next Story