ఢిల్లీ బ్లాస్ట్.. అల్‌-ఫలాహ్ డాక్టర్ మిస్సింగ్!

by Muthe.Rajitha |

ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ బ్లాస్ట్.. అల్‌-ఫలాహ్ డాక్టర్ మిస్సింగ్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న హరియాణాలో ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ వర్శిటీ వైద్యులకు ఎర్రకోట పేలుళ్లతో లింకులు ఉన్నాయని NIA అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ విద్యాసంస్థకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్‌ హసన్ మిస్సింగ్ అవడం కలకలం రేపుతోంది. ఢిల్లీ ఘటన తర్వాత అల్‌-ఫలాహ్ యూనివర్సిటీలో NIA అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అనుమానం కలిగిన ప్రతీ ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ విద్యాసంస్థలో పనిచేస్తున్న డాక్టర్ నిసార్ కనిపించకుండా పోయాడు. కాగా ఉగ్రముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కశ్మీర్లో 2023లో ఆర్టికల్ 311(2)(C) కింద ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ తర్వాత అతడికి అల్‌-ఫలాహ్ యూనివర్సిటీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది. అయితే ఢిల్లీ పేలుడు తర్వాత అతడు కనిపించకుండా పోయాడని, ప్రస్తుతం అతడి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Next Story