ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-05 01:55:49  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ (Voting) కొనసాగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 13,766 పోలింగ్‌ కేంద్రాలలో 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక 3 వేల సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. 35 వేల మంది ఎన్నికల విధుల్లో 35 వేల మంది పోలీసులు పాల్గోన్నారు. ఇక అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress) మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.

Next Story