- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో కలకలం: గేటు బద్దలు కొట్టి లోపలికి దూసుకెళ్లిన కారు!
దేశ రాజధానిలోని ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలోని ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి, కారుతో అసెంబ్లీ గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ (UP) కలిగిన ఒక కారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీలోని గేట్ నంబర్ 2 వద్ద ఉన్న బారికేడ్లను, భద్రతా కవచాన్ని బలంగా ఢీకొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించింది. లోపలికి వెళ్లిన తర్వాత, అక్కడ ఉన్న అసెంబ్లీ స్పీకర్ వాహనంపై సదరు వ్యక్తి సిరా (Ink) చల్లి నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది..
ఈ హఠాత్తు పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలోనే అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, ఈ ఘటన భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. నిందితుడు ఎవరు? అసెంబ్లీలోకి అంత వేగంగా ఎందుకు దూసుకొచ్చాడు? స్పీకర్ వాహనాన్ని ఎందుకు లక్ష్యం చేసుకున్నాడు? అనే కోణంలో ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసెంబ్లీ వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోకి కారు చొచ్చుకురావడంపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






