Delhi assembly: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టులు.. ఈ నెల 25న ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!

by B.Srinivas |

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

Delhi assembly: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టులు.. ఈ నెల 25న ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ (Delhi assembly) సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు సభ జరగనుండగా మొదటి రోజు కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మరుసటి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం ఉంటుంది. అలాగే గత ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ప్రభుత్వ పనితీరుపై పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు. చివరి రోజు ఎల్జీ ప్రసంగంపై ధన్యవద తీర్మానంపై చర్చ, డిప్యూటీ స్పీకర్ (Deputy speaker) ఎన్నిక జరగనుంది. బీజేపీ ఎమ్మెల్యే అరవిందర్ సింగ్ లవ్లీ ప్రొ-టెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికవనున్నట్టు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిష్ట్‌ పేరు ఖరారైనట్టు సమాచారం. ఆదివారం ఢిల్లీ పార్టీ యూనిట్ కార్యాలయంలో అధికార బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరుగనుంది. కాగా, ఇటీవలే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

Next Story