Delhi Airport: రక్షణ శాఖకు చెందిన ఎయిర్ పోర్టలోకి కమర్షియల్ ఫ్లైట్స్

by Shamantha N |   (  Updated:2025-03-17 14:23:00  IST  )

రక్షణ శాఖకు చెందిన ఎయిర్ పోర్టులోకి కమర్షియల్ ఫ్లైట్స్ ని అనుమతించినందుకు.. కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) దావా వేసింది.

Delhi Airport: రక్షణ శాఖకు చెందిన ఎయిర్ పోర్టలోకి కమర్షియల్ ఫ్లైట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ శాఖకు చెందిన ఎయిర్ పోర్టులోకి కమర్షియల్ ఫ్లైట్స్ ని అనుమతించినందుకు.. కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) దావా వేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జీఎంఆర్‌ (GMR) సంస్థ దావా వేసినట్లు తెలిపింది. గాజియాబాద్‌ విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతిస్తే ఢిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా నష్టపోతుందని ఆరోపించింది. దీనిపై, మార్చి 10న ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా లేకపోతే ఒక విమానాశ్రయానికి, మరో విమానాశ్రయానికి మధ్య 150 కి.మీ దూరం ఉండాలనే నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని అధికారులు దావాలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) హైకోర్టుకి తెలిపింది. అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి కొనసాగుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరారు. కాగా ఈ విషయంపై భారత విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది. ట్రైలీగల్ అనే న్యాయ సంస్థ డీఐఏఎల్ (DIAL)కు ప్రాతినిధ్యం వహిస్తుంది.

21 మిలియన్ డాలర్ల నష్టం

ప్రపంచంలోని అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టు ఒకటి. గతేడాది దాదాపు 73.6 మిలియన్ల మంది ప్రయాణికులు దీన్ని ఉపయోగించారు. అయితే ప్రభుత్వ రుసుములు పెరగడం వల్ల దాదాపు 21 మిలియన్‌ డాలర్లు(సుమారు 180 కోట్లు) నష్టపోయింది. దీనికి విరుద్ధంగా, ఆదివారం నాటికి ఎయిర్‌బేస్ వినియోగదారుల సంఖ్య దాదాపు 1,400కి చేరింది. మరోవైపు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉంది.

Read More..

చూడ్డానికి అది పెంకుటిల్లే.. కానీ లోపలికి వెళ్లి చూస్తే మతిపోవాల్సిందే!

Next Story