Delhi airport: ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100 విమానాల రద్దు

by B.Srinivas |

భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే 100 విమానాలను ఆదివారం రద్దు చేసినట్టు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి.

Delhi airport: ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100 విమానాల రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi air port) నుంచి రాకపోకలు సాగించే 100 విమానాలను ఆదివారం రద్దు చేసినట్టు ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి. అలాగే దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సుమారు 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు 52 దేశీ, 44 ఇన్ కమింగ్, ఒక అంతర్జాతీయ విమానాన్ని రద్దు చేశారు. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (DIAL) ఓ ప్రకటనలో తెలిపింది. కానీ భద్రతా చర్యల కారణంగా, సెక్యురిటీ తనిఖీ కేంద్రాల వద్ద కొన్ని విమాన షెడ్యూల్‌లు, ప్రాసెసింగ్ టైం ప్రభావితమయ్యే చాన్స్ ఉందని పేర్కొంది. ప్రయాణికులు భద్రతా సిబ్బందికి సహకరించాలని సూచించింది.

కాగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానయాన కేంద్రం. ఇక్కడి నుంచి ప్రతి రోజూ 1300 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. భారత్ పాక్ ఉద్రిక్తతల కారణంగా పలు మార్లు సేవలకు అంతరాయం కలిగింది. అయితే సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ విమానాశ్రయంలో అదనపు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విమానాలకు రద్దు చేసినట్టు తెలుస్తోంది.

Next Story