వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణ స్వీకారం

by Muthe.Rajitha |

వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ ఎలోయినా రోడ్రిగ్జ్ గోమెజ్‌ను జనవరి 5న కారకాస్‌లోని నేషనల్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసారు.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్ : వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ ఎలోయినా రోడ్రిగ్జ్ గోమెజ్‌ను జనవరి 5న కారకాస్‌లోని నేషనల్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసారు. ఇది ఆమె సోదరుడు, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ చేతుల మీదుగా జరిగింది. జనవరి 3న అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ‘ఆపరేషన్ ఆబ్జల్యూట్ రిజాల్వ్’లో భాగంగా అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్యను అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించిన తర్వాత, వెనెజులా సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది.

కాగా డెల్సి.. ప్రమాణ స్వీకార ప్రసంగం చేస్తూ.. మదురోనే వెనెజులా నిజమైన అధ్యక్షుడని చెప్పి, ఆయన విడుదల కావాలని డిమాండ్ చేశారు. అమెరికా చేసిన చర్యను అక్రమ సైనిక దాడి, కిడ్నాప్‌గా ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే అదే సమయంలో అమెరికాతో గౌరవప్రదమైన సంబంధాలకు తాము సిద్ధమేనని కూడా పేర్కొన్నారు. 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్ హ్యూగో చావెజ్, మదురోకు అత్యంత నమ్మకమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతంలో ఆమె కమ్యూనికేషన్ మంత్రి, విదేశాంగ మంత్రి, ఉపాధ్యక్షురాలు, చమురు మంత్రి వంటి కీలక పదవులు నిర్వహించారు.

మదురో అరెస్ట్ అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి దారి తీసింది. రష్యా, చైనా, క్యూబా వంటి దేశాలు అమెరికా చర్యను ఖండించగా, కొన్ని అమెరికా మిత్రదేశాలు కూడా ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాయి.

Next Story