- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Defence: భారత రక్షణ ఉత్పత్తి రూ.1.50 లక్షల కోట్లు.. ఆల్‌టైమ్ రికార్డ్
by B.Srinivas |
2024-25లో భారతదేశ వార్షిక రక్షణ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.1,50,590 కోట్లకు చేరుకుంటుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: 2024-25లో భారతదేశ వార్షిక రక్షణ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.1,50,590 కోట్లకు చేరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.27 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం 18 శాతం పెరగడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) నాయకత్వంలో దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుందని కొనియాడారు. 2019-20లో ఇది రూ. 79,071 కోట్లుగా ఉండగా 2024-25 నాటికి 90 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ మైలురాయిని సాధించడంలో రక్షణ ఉత్పత్తి శాఖ, రక్షణ ప్రభుత్వ రంగ యూనిట్లు. ప్రయివేట్ పరిశ్రమలు సహా అన్ని వాటాదారులు దోహదపడ్డారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీనిని చారిత్రక విజయంగా అభివర్ణించారు.
Next Story






