బిహార్‌లో దారుణ ఓటమి.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ షాకింగ్ రియాక్షన్

by Malleboina Mahesh |

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి.. ఎన్డీయే కూటమి 190 కి పైగా స్థానాల్లో లీడ్ కొనసాగిస్తుంది.

బిహార్‌లో దారుణ ఓటమి.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ షాకింగ్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి.. ఎన్డీయే కూటమి 190 కి పైగా స్థానాల్లో లీడ్ కొనసాగిస్తుంది. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహాఘట్ బంధన్ కూటమి దారుణంగా 45 సీట్లకే పరిమితం అయింది. ఈ దారుణమైన ఫలితాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్‌లో జరిగిన SIR (Special Intensive Revision) ప్రక్రియను “ఎన్నికల కుట్ర”గా అభివర్ణిస్తూ, భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు తొలగించడం ఫలితాలపై ప్రభావం చూపిందని ఆరోపించారు.

“బిహార్‌లో SIR ఆడిన ఆట బయటపడింది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆట సాగనివ్వం” అని ఆయన ట్వీట్‌లో హెచ్చరించారు. బీజేపీ చర్యలను పర్యవేక్షించేందుకు తమ పార్టీ ఏర్పరచిన ‘PPTV – PDA Sentinel’ వ్యవస్థ దేశవ్యాప్తంగా CCTVలా పని చేస్తుందని తెలిపారు. అదే సమయంలో, బీజేపీని “పార్టీ కాదు "మోసం” అని అఖిలేశ్ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. బిహార్ ఫలితాల్లో కనిపించిన అసమానతలు ఎన్నికల వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తాయని, ఇకపై ప్రతిపక్షం ఈ తరహా ఎన్నికల కుట్రలను అడ్డుకునేందుకు ఏకగళంగా నిలబడుతుందని ఆయన ప్రకటించారు. బిహార్‌లో ఓటర్ల జాబితా తొలగింపుల వివాదం కొనసాగుతుండగా, అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు రాజకీయ వేడిని తీవ్రతరం చేశాయి.

Next Story