- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. విజయ్ పార్టీ జెండా స్తంభం కూలి ఒకరు మృతి
by Kema Shiva Kumar |
తలపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ జెండా స్తంభం కూలి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu)లో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తలపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ జెండా స్తంభం కూలి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్టీ రెండో మహానాడు కోసం ఇవాళ మదురై (Madurai)లో 100 అడుగుల ఎత్తైన టీవీకే పార్టీ జెండా స్తంభాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, క్రేన్‌తో స్తంభాన్ని పైకి ఎత్తుతుండగా.. చైన్ తెగడంతో ఆ భారీ స్తంభం పక్కనే ఉన్న కారుపై పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. అక్కడున్న వారు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కారులో ఓ వ్యక్తి ఉండగా.. అతడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పార్టీ నేతల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story






