తీవ్ర విషాదం.. కెనడాలో మరో భారతీయ విద్యార్థిని మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-20 04:10:48  IST  )

కెనడాలో మరో భారతీయ విద్యార్థిని మృతిచెందింది.

తీవ్ర విషాదం.. కెనడాలో మరో భారతీయ విద్యార్థిని మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కెనడాలో (Canada) మరో భారతీయ విద్యార్థిని మృతిచెందింది. కాల్గరీ యూనివర్సిటీలో (University of Calgary) చదువుతున్న ఢిల్లీకి (Delhi) చెందిన తాన్య త్యాగి ఆకస్మికంగా మృతిచెందింది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ గురువారం అధికారికంగా ప్రకటించింది. మృతురాలి కుటుంబానికి భారత కాన్సులేట్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించింది. 'మేము ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం' అని కాన్సులేట్ ఎక్స్ వేదికగా తెలిపింది.

తాన్య మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు కొన్ని నెలల ముందే మరో భారతీయ విద్యార్థిని సుడిక్షా కోనంకి, మిస్సింగ్ కావడం తెలిసిందే. ఇక ఈ తాజా ఘటనల వల్ల విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Next Story