- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ కార్నర్ మీటింగ్‌లో తీవ్ర విషాదం.. 40కి చేరిన మృతుల సంఖ్య
తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దళపతి, టీవీకే అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దళపతి, టీవీకే అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 40కి చేరగా.. గాయపడిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. గాయపడినవారికి కరూర్లోని ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కాగా.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, 12 మంది మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ కార్నర్ మీటింగ్ కు 50 వేల మంది హాజరవ్వడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తమిళననాడు పోలీసులు చెప్తున్నారు. సభకు 10 వేల మందికే అనుమతి ఇవ్వగా .. నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతంలో తక్షణ సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రేపు సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.






