ఢిల్లీ పేలుడు.. 10 కి చేరిన మృతుల సంఖ్య

by Muthe.Rajitha |

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ పేలుడు.. 10 కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 10 కి చేరింది. మరో 30 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఈ పేలుడు.. ఎర్రకోట వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లో ఆగిన కారులోనే సంభవించిందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఎర్రకోట, చాందినీ చౌక్ వైపు వెళ్లే రోడ్డును పూర్తిగా మూసివేసి, అక్కడి ప్రదేశాలను ఖాళీ చేసి పంపించారు పోలీసులు. అలాగే దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

Next Story