- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువతి మృతి.. వెలుగులోకి మరో విషాదం!
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార అలవాట్లు, వ్యాయామం సరిగా లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార అలవాట్లు, వ్యాయామం సరిగా లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)తో తుదిశ్వాస విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ తరుణంలో నిన్న(ఆదివారం) సోదరి వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ ఓ యువతి ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె గుండెపోటుతో మరణించింది. అసలు విషయంలోకి వెళితే.. మధ్యప్రదేశ్(Madhya Pradesh) యువతి పరిణీతి స్టేజీపై డాన్స్(Dance) చేస్తూ గుండెపోటుతో మరణించిన ఘటన నేపథ్యంలో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆమె సోదరుడు కూడా హార్ట్ ఎటాక్‌తోనే చనిపోయాడు. అప్పుడు అతనికి కేవలం 12 ఏళ్లే కావడం గమనార్హం. గుండెపోటుతో కొడుకు, కూతురిని కోల్పోవడం వారి పేరెంట్స్‌కు కడుపుకోతను మిగిల్చింది. పిల్లలిద్దర్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






