Gutka ban: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం

by Shamantha N |

ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) అసెంబ్లీ (Assembly)లో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధిస్తూ స్పీకర్ Speaker) సతీష్‌ మహనా (Satish Mahana) బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

Gutka ban: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) అసెంబ్లీ (Assembly)లో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధిస్తూ స్పీకర్ Speaker) సతీష్‌ మహనా (Satish Mahana) బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ సతీష్ మహానా మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ పరిసరాల్లో గుట్కా, పాన్‌ మసాలా తినడం నిషిద్ధం. ఈ నిర్ణయం ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుంది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధించబడుతుంది. జరిమానాతోపాటు నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మహానా ఈ ప్రకటన వెలువరించారు. తక్షణమే, అసెంబ్లీ ప్రాంగణంలో పాన్ మసాలా, గుట్కా వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం కారణంగా జరిమానా మొత్తాన్ని పెంచాలని అసెంబ్లీలో ఉన్న కొందరు సభ్యులు స్పీకర్ కు సూచించారు. "అధిక జరిమానా డిమాండ్ చేస్తున్న సభ్యుల పేర్లను గమనించండి.. ఎవరైన ఉమ్మి వేస్తూ పట్టుబడితే వారి నుంచి అదనంగా వసూలు చేస్తాం" అని మహానా చమత్కరించారు. ఆయన ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. మరోవైపు, మంగళవారం అసెంబ్లీ హాల్లోని ఓ ఎమ్మెల్యే పాన్ మసలా నమిలి ఉమ్మివేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్‌ సిబ్బందితో కలిసి దాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత సభలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశాని చెప్పుకొచ్చారు. కానీ, పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవట్లేదన్నారు. తనంతట తానుగేనే పాన్ మసాలా ఉమ్మివేసిన వ్యక్తి తన దగ్గరకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక మీదట ఎవరైనా అలా చేయడం గమనిస్తే.. వారిని అడ్డుకోవాలని సూచించారు. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు.

Next Story